international yoga day: రాజస్థాన్ లోని ‘కోట’లో రికార్డుల మోత... రామ్ దేవ్ సారథ్యంలో యోగాసనాలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e6464f6e939366940118071355eb098f1572f47e.jpg)
- 1.05 లక్షల మందితో యోగసనాలు
- ఇంకా వచ్చి చేరుతున్న ప్రజలు
- కొనసాగుతున్న లెక్కింపు
- ఇప్పటికే వివిధ విభాగాల్లో 100 రికార్డులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు రాజస్థాన్ లోని ‘కోట’ పట్టణంలో యోగా గురువు బాబా రామ్ దేవ్ సారధ్యంలో ఈ రోజు రికార్డుల మోత మోగుతోంది. ‘‘1.05 లక్షలకు పైగా ప్రజలతో యోగా నిర్వహించినందుకు ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ జారీ చేశారు. మరింత మంది ప్రజలు ఇందులో వచ్చి చేరుతున్నారు. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. సూర్య నమస్కారాలు, పుష్ అప్ లు తదితర భిన్న విభాగాల్లో ఈ రోజు 100 రికార్డులను నమోదు చేయడం జరిగింది. ఇది గర్వపడే సమయం’’ అని రామ్ దేవ్ చెప్పారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-d8d8f74a75dc704b88805d0f0bc3139cf384e211.jpg)