శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా .. రేపే లాంచ్
- 'అసుర' దర్శకుడి మరో ప్రయత్నం
- కథానాయకుడిగా శ్రీవిష్ణు
- త్వరలో పూర్తి వివరాలు
'అసుర' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కృష్ణ విజయ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ .. ఓం శ్రీ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల 27 నిమిషాలకి ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ .. నారా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.