oppo findx: యాపిల్ ఐఫోన్ ను తలదన్నే ఒప్పో ఫైండ్ ఎక్స్!

  • ఫుల్ స్క్రీన్ ఫోన్
  • ముందు భాగంలో 25 మెగా పిక్సల్ కెమెరా
  • వెనుక 16+20 ఎంపీ కెమెరాలు
  • కెమెరాలకు స్లైడర్

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ ఫైండ్ ఎక్స్, ఫైండ్ ఎక్స్ లంబోర్గిని ఫోన్లను ఆవిష్కరించింది. పారిస్ లో జరిగిన కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ జూలై 12న మన దేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఓఎస్, 6.4 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, వెనుక భాగంలో 16 ఎంపీ, 20ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి.

 కెమెరాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. కెమెరాలకు స్లైడర్ ఉంటుంది. అవసరమైనప్పుడు అవి తెరచుకుంటాయి. దీంతో కెమెరాలు బయటకు వస్తాయి. దీని ధర యూరోప్ లో 999 యూరోలు. మన కరెన్సీలో సమారు రూ.78,700. లంబోర్గిని ఎడిషన్ ఫోన్ 512 జీబీ స్టోరేజీతో ఉంటుంది. ఇందులో బ్యాటరీని వేగంగా చార్జ్ చేసేందుకు వీవోసీసీ టెక్నాలజీ వాడారు. 35 నిమిషాల్లో చార్జింగ్ పూర్తవుతుంది. దీని ధర 1,699 యూరోలు (రూ.1,34,470). ఈ ఫోన్లు ఫుల్ స్క్రీన్ తో ఉంటాయి. 

  • Loading...

More Telugu News