Guntur District: గుంటూరులో బ్యూటీషియన్ సిరి, హైదరాబాద్ లో ఆమె ప్రియుడు... జంట ఆత్మహత్యల కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

  • ఓ యువకుడిని ప్రేమించిన సిరి
  • పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • విషయం ప్రియుడికి చెప్పి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల పోలీసులు ఓ జంట ఆత్మహత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. గుంటూరు నగరంలో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతున్న సిరి అనే యువతి ఆత్మహత్య చేసుకోగా, అదే సమయంలో హైదరాబాద్ లో ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తొలుత రెండూ వేర్వేరు కేసులుగానే నమోదు చేసుకున్న పోలీసులు, విచారణలో ఒకరి ఫోన్ నంబర్ మరొకరి సెల్ ఫోన్ లో ఉండటంతో ఆత్మహత్యల వెనకున్న మిస్టరీపై దృష్టిని సారించారు. యాదగిరిగుట్టకు చెందిన సిరి, గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో వాళ్ల పెద్దలకూ తెలుసు. అయితే, పెళ్లికి రెండు కుటుంబాల వాళ్లూ అంగీకరించలేదు.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఈ జంట ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సిరి చనిపోవడానికి ముందు తను ప్రేమించిన యువకుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తుండటంతో, ఇక ఆమె చనిపోతుందని, దాన్ని తాను ఆపలేనని భావించిన యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Guntur District
Hyderabad
Police
Sucide
Siri
Beautician
  • Loading...

More Telugu News