nagarjuna: నాగ్ .. నాని మల్టీస్టారర్ అప్ డేట్స్!

  • మల్టీ స్టారర్ తో శ్రీరామ్ ఆదిత్య 
  • హీరోలుగా నాగ్ .. నాని 
  • నాయికలుగా ఆకాంక్ష .. రష్మిక 

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా కనిపించనుండగా .. డాక్టర్ పాత్రను నాని పోషిస్తున్నాడు. దాంతో ఈ సినిమా అంతా సీరియస్ గా కొనసాగుతుందని అనుకున్నారు. యాక్షన్ పార్టు ఎక్కువగా ఉండొచ్చని భావించారు.కానీ ఈ సినిమా పూర్తి వినోదభరితంగా సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. నాగార్జున .. నాని పాత్రల మధ్య చోటుచేసుకునే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని అంటున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను కదిలించే ఎమోషన్స్ పాళ్లు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు.  

  • Loading...

More Telugu News