Ganta Srinivasa Rao: లగడపాటికి గంటాపై ఎందుకంత కోపం?: చినరాజప్ప కీలక వ్యాఖ్యలు

  • తన సర్వే కోసం భీమిలిని ఎంచుకోవడం ఏంటి?
  • గంటా మనస్తాపానికి గురి కావడం సహజమే
  • ఆయన అలకలో తప్పేమీ లేదన్న చినరాజప్ప

తాను చేయించాలనుకున్న సర్వేను గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నియోజకవర్గంలోనే లగడపాటి రాజగోపాల్ చేయించడం ఏంటని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లగడపాటికి గంటాపై ఎందుకంత కోపమని ప్రశ్నించిన ఆయన, సర్వే ఫలితాలు చూసిన గంటా మనస్తాపానికి గురికావడం సహజమేనని అన్నారు.

ఆ సర్వే ఫలితాలు అలకను తెప్పించేలానే ఉన్నాయని, ఎవరు ఏమి అన్నా, వ్యతిరేకత ఉన్నా వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి పోటీ పడతారని స్పష్టం చేశారు. అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాసే పోటీలో ఉంటారని చెప్పారు. గంటా అలకలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డ ఆయన, ఆయనకు ఇబ్బంది కలిగించేలా సర్వే ఉందని వ్యాఖ్యానించారు.

Ganta Srinivasa Rao
Andhra Pradesh
Bhimili
Nimmakayala Chinarajappa
  • Loading...

More Telugu News