anam ramnarayana reddy: ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలనుకున్నా.. ఇవ్వలేక పోవడానికి కారణం ఇదే: చంద్రబాబు

  • రామనారాయణరెడ్డికి గౌరవం ఇవ్వనిది ఎన్నడు?
  • పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చా.. ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలనుకున్నా
  • ఆనం వివేకా కూడా ఎమ్మెల్సీ పదవి కావాలని అడిగారు

టీడీపీలో తనకు సరైన గౌరవం లేదన్న భావనతో వైసీపీలో చేరేందుకు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. పార్టీలో ఆయనను తాము ఎక్కడ అగౌరవపరిచామని, ఆయనకు గౌరవం ఇవ్వనిది ఎన్నడు? అంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబును కలిసిన సమయంలో ఆనం విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు.

ఆనంకు ఉన్న సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని, ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలనుకున్నానని... అయితే, అదే సమయంలో ఆనం వివేకా కూడా తనను కలిసి ఎమ్మెల్సీ పదవి కావాలని అడిగారని, ఇద్దరూ పదవిని అడగడంతో ఏం చేయాలో పాలుపోలేదని... దీంతో పదవిని ఇవ్వలేకపోయానని చెప్పారు.

ఇదే సమయంలో తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆనం సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి చంద్రబాబుకు స్పష్టం చేశారు. పార్టీని వీడటానికి రామనారాయణరెడ్డి చెబుతున్న కారణాలు తనకు కూడా సబబుగా అనిపించలేదని... అందుకే టీడీపీలోనే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్ రెడ్డిని చంద్రబాబు అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ లు పాల్గొన్నారు. 

anam ramnarayana reddy
Chandrababu
anam viveka
nellore
Telugudesam
  • Loading...

More Telugu News