Jagan: మరో మైలురాయిని దాటిన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర!

  • 2,400 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర
  • లక్కవరం వద్ద మొక్కను నాటిన జగన్
  • 9 జిల్లాల్లో ముగిసి పదో జిల్లాలో జగన్ యాత్ర

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర మరో మైలురాయిని దాటింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లక్కవరం వద్ద జగన్ పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, ఈ సందర్భంగా జగన్ ఓ మొక్కను ఆ ప్రాంతంలో నాటారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కాగా, జగన్ పాదయాత్ర ఇప్పటివరకూ 9 జిల్లాల్లో పూర్తయి 10వ జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  

Jagan
YSRCP
Padayatra
East Godavari District
Mile Stone
  • Loading...

More Telugu News