Kadapa District: నేడు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం... కలవనున్న వైసీపీ, కాంగ్రెస్, జనసేన నేతలు!

  • కడపలో స్టీల్ ప్లాంట్ పై చర్చ
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడనున్న నేతలు
  • ఇప్పటికే కడపలో దీక్ష చేస్తున్న సీఎం రమేష్

విజయవాడలో నేడు రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. కడపలో ఉక్కు కర్మాగారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అన్ని పార్టీల నేతలూ చర్చించనున్నారు.

కడప సహా తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ల ఏర్పాటు సాధ్యం కాదని చెబుతూ, 'సెయిల్' ఇచ్చిన నివేదికతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బుధవారం నుంచి కడపలో ఆమరణ దీక్షను ప్రారంభించగా, అంతకు ఒక రోజు ముందు నుంచే వైకాపా నాయకులు దీక్షలు ప్రారంభించారు.

Kadapa District
Vijayawada
YSRCP
Jana Sena
Congress
Meeting
CPI
CPM
  • Loading...

More Telugu News