Madhya Pradesh: కన్నతల్లిని వేధించి, గెంటేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం కుమారుడు!

  • ఫిర్యాదు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం అర్జున్ సింగ్ భార్య
  • అజయ్ సింగ్, ఆయన భార్యపై కేసు నమోదు 
  • కేసు వెనుక సీఎం ఉన్నారని అజయ్ సింగ్ ఆరోపణ

కన్నతల్లిని వేధించడంతో పాటు ఇంటి నుంచి గెంటేశారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. అర్జున్ సింగ్ భార్య సరోజ్ కుమారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అజయ్, ఆయన భార్యపై కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించారు.

కాగా, తమ ఇంటి విషయాల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కల్పించుకుంటున్నారని, తన తల్లితో ఆరోపణలు చేయించి, తల్లీ బిడ్డల మధ్య దూరం పెంచుతున్నారని అజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే గృహహింస చట్టాన్ని తనపై ప్రయోగించాలని చూస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చౌహాన్ స్పందిస్తూ, ఎవరి కుటుంబ విషయాల్లోనూ కల్పించుకోవాల్సిన అవసరం తనకు లేదని, కొడుకుపై స్వయంగా తల్లే ఫిర్యాదు చేస్తుంటే తానేం చేయాలని ప్రశ్నించారు.

Madhya Pradesh
Arjun Singh
Ajay Singh
Sivaraj Singh Chouhan
  • Loading...

More Telugu News