Yoga Day: చంద్రబాబు నుంచి మోదీ వరకూ... జగమంత యోగా!

- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
- దేశవ్యాప్తంగా 5 వేల చోట్ల వేడుకలు
- డెహ్రాడూన్ లో పాల్గొన్న నరేంద్ర మోదీ
- అమరావతిలో చంద్రబాబు యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 55 వేల మంది ఔత్సాహికులతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. ఓ భారీ మైదానంలో వయోభేదం లేకుండా బారులు తీరిన ప్రజలు పలు రకాల ఆసనాలు వేసి, తమ ఫిట్ నెస్ ను చూపారు. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన యోగా డే వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

