Andhra Pradesh: ఏపీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచిన సీఎం చంద్రబాబు!

- అంగన్ వాడీ టీచర్ల, ఆయాల వేతనాలు పెంచుతున్నాం
- అన్ని వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్లకు పైగా భారం
ఏపీలోని అంగన్ వాడీ టీచర్లకు సీఎం చంద్రబాబునాయుడు వరాలజల్లు కురిపించారు. అంగన్ వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని తన నివాసంలోని ప్రజాదర్బార్ హాలులో సాధికార మిత్రలతో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, రూ.7,500 ఉన్న అంగన్ వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500కు, రూ.4,500 గా ఉన్న ఆయాల వేతనాలను రూ.6,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

