micro soft: అక్రమ వలసల నివారణపై ట్రంప్ వైఖరి దారుణం: సత్య నాదెళ్ల

  • అమెరికా అగ్ర దేశంగా ఎదగడానికి కారణం వలస విధానమే
  • దీని వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా
  • ఈ వలస విధానమే అమెరికాకు ఉన్న బలం

మెక్సికో నుంచి అమెరికాకు వస్తున్న అక్రమ వలసదారులపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న వైఖరి చాలా దారుణంగా ఉందని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన  బ్లాగ్ లో విమర్శించారు. అమెరికా అగ్ర దేశంగా ఎదగడానికి కారణం వలస విధానమేనని, తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఈ విధానమేనని అన్నారు.

అమెరికాలో కాకుండా ఏ ఇతర దేశంలోనూ తాను ఇంతటి పేరు పొందగలిగేవాడిని కాదని, ఈ వలస విధానమే అమెరికాకు ఉన్న బలమని ప్రశంసించారు. మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అనుసరిస్తోన్న కొత్త విధానాలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయని, తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేయడం చాలా దారుణమని అన్నారు. మానవహక్కులు, నైతికతను కాపాడేలా ఉండే విధానాలకే మద్దతు తెలుపుతానని చెప్పిన సత్య నాదెళ్ల, ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంతో ‘మైక్రోసాఫ్ట్’కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేయదలచుకున్నానని పేర్కొన్నారు.

micro soft
satya nadella
  • Loading...

More Telugu News