Hyderabad: హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు

  • పాస్‌పోర్ట్ సేవల్లో అత్యుత్తమ సేవలకు గానూ అవార్డు
  • జూన్‌ 1 నుంచి పాస్‌పోర్ట్‌ జారీ, పోలీసుల విచారణలో మార్పులు
  • పాస్‌పోర్ట్ జారీ విషయంలో అతి త్వరగా పోలీస్‌ వెరిఫికేషన్‌

త్వరగా, పారదర్శకంగా సేవలు అందిస్తోన్న హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి మరో గుర్తింపు వచ్చింది. పాస్‌పోర్ట్ సర్వీసుల్లో అత్యుత్తమ సేవలకు గానూ జాతీయ అవార్డు వచ్చింది. తాజాగా హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

జూన్‌ 1 నుంచి పాస్‌పోర్ట్‌ జారీ, పోలీసుల విచారణలో మార్పులు తీసుకొచ్చామని ఆయన అన్నారు. పాస్‌పోర్ట్ జారీ విషయంలో పోలీస్‌ వెరిఫికేషన్‌ త్వరగా పూర్తవుతోందని, తాము తీసుకుంటోన్న చర్యలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్ర ప్రాజెక్టును కూడా 18 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, తెలంగాణలో విజయవంతమవుతోందని చెప్పారు.

Hyderabad
passport
award
  • Loading...

More Telugu News