tarun bhaskar: సురేశ్ బాబుగారు అలా అనడంతో నమ్మలేకపోయాను!: తరుణ్ భాస్కర్

- కథ ఎంపిక విషయంలో ఆలస్యమైంది
- యువ దర్శకుల కష్టాలనే కథగా మలిచాను
- ప్రివ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది
'పెళ్లి చూపులు' సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాదు .. కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తొలి ప్రయత్నంతోనే దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన నుంచి 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా వస్తోంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. " 'పెళ్లిచూపులు' భారీ విజయాన్ని సాధించడంతో ఆ తరువాత ఎలాంటి కథను తయారుచేసుకోవాలనే విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాను. అందువలన ఈ సినిమా రెడీ కావడానికి చాలా గ్యాప్ వచ్చింది.
