cpm raghavulu: కేంద్రం చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదు!: సీపీఎం నేత రాఘవులు

  • రాష్ట్రాన్ని అనైతికంగా విభజించారు
  • బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు
  • చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజస్వామ్యం, మేము చేస్తే అరాచకమా?

రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నో హామీలైతే ఇచ్చారు కానీ, ఏపీకి చివరకు, బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జాతీయ నేత రాఘవులు విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అనైతికంగా విభజించారని, ఏపీకి  ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని కోరిన వెంకయ్యనాయుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

 రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామని అన్నారు. టీడీపీ నేత సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారని, మరి ఈ నాలుగేళ్ల నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రమేష్ చేసే దీక్షలో చిత్తశుద్ధి లేదని, ఏ సమస్యపైనైనా తాము దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమను అరెస్టు చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజస్వామ్యం, తాము చేస్తే అరాచకమా? అని ప్రశ్నించారు. మన దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో కేంద్ర ప్రభుత్వం పెడుతోందని రాఘవులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News