nithin: నితిన్ నుంచి మరో లవ్ స్టోరీ .. టైటిల్ గా 'భీష్మ'

  • వెంకీ కుడుముల దర్శకత్వంలో లవ్ స్టోరీ 
  • కథానాయకుడిగా నితిన్ 
  • ఈ సినిమాపైనే ఆయన ఆశలు

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ కి 'సింగిల్ ఫరెవర్' అనేది ట్యాగ్ లైన్ గా ఉంచారు. ఒక ప్రేమకథకు 'భీష్మ' అనే టైటిల్ ను పెట్టడం .. 'సింగిల్ ఫరెవర్' అనేది ట్యాగ్ లైన్ గా ఉంచడమే ఆసక్తిని రేకెత్తిస్తుందనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు వున్నారు.

'ఛలో' సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రేమకథను ఆయన కొత్తగా చెప్పిన తీరు యూత్ ను బాగా ఆకట్టుకుంది. నితిన్ తో చేసేది కూడా లవ్ స్టోరీనే కావడం వలన అందరిలో ఆసక్తి పెరుగుతోంది. వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న నితిన్, ఈ సినిమాతో తాను ఆశిస్తోన్న హిట్ దొరుకుతుందనే నమ్మకంతో వున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.   

nithin
venky kudumula
  • Loading...

More Telugu News