Ranbir Kapoor: పెళ్లిపీటలు ఎక్కనున్న రణ్ బీర్ కపూర్, అలియా భట్?

  • ప్రేమలో మునిగితేలుతున్న రణ్ బీర్, అలియా
  • పెళ్లిచేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లైఫ్ లో కథనం
  • 'బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్న జంట

బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియాభట్ లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమే అన్నట్టుగా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ లైఫ్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇప్పటికిప్పుడే వీరి పెళ్లి జరగదని, 2020లో జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ మొదలైంది.

రణ్ బీర్ కపూర్ తొలుత సోనమ్ కపూర్, ఆ తర్వాత దీపికా పదుకునేలతో ప్రేమాయణం సాగించాడు. ఈ ప్రేమలు బ్రేకప్ అయిన తర్వాత కత్రినాకైఫ్ తో డేటింగ్ చేశాడు. మరోవైపు అలియాభట్ కూడా హీరో సిద్ధార్థ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందంటూ గతంలో వార్తలు వచ్చాయి.

Ranbir Kapoor
Alia Bhatt
marriage
bollywood
brahmastra
  • Loading...

More Telugu News