nani: దిల్ రాజు బ్యానర్లో నాని సినిమా 'సభకు నమస్కారం'!

  • మల్టీస్టారర్ మూవీ చేస్తోన్న నాని
  • ఆ తరువాత చిత్రంగా 'జెర్సీ'
  • పొలిటికల్ థ్రిల్లర్ కథాంశం   

నాని ఒక వైపున కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూనే .. మరో వైపున వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆయన మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో 'జెర్సీ' మూవీ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటే కొత్త దర్శకుడితో నాని ఓ ప్రాజెక్టు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారు. 

పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. కథలో వైవిధ్యం కారణంగా .. తాను ఇంతవరకూ చేయని పాత్ర కారణంగా వెంటనే నాని ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇక దిల్ రాజుకి కూడా ఈ కథ బాగా నచ్చేసిందని చెబుతున్నారు. గతంలో నానితో ఆయన నిర్మించిన 'నేను లోకల్' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలు ఘన విజయాలను సాధించాయి. అందువలన ఈ కొత్త ప్రాజెక్టు చేద్దామని ఆయనే నానిని ఒప్పించాడని అంటున్నారు.  

  • Loading...

More Telugu News