gopichand: తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా పంతం పాట విడుదల

- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'పంతం' సినిమా రూపొందింది. కథానాయికగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదిలారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు.
