Jagan: మోదీ, జగన్ లపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందన

  • వ్యక్తిగత స్వార్థంలేని వ్యక్తి మోదీ
  • ప్రతిపక్ష నేతగా జగన్ పనితీరు బాగానే ఉంది
  • పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా బతికింది

వ్యక్తిగతంగా ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి ప్రధాని మోదీ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ బాగానే పని చేస్తున్నారని కితాబునిచ్చారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని అన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని చెప్పారు. అయితే, ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోనని చంద్రబాబు అన్నారంటూ జరిగిన ప్రచారాన్ని మాత్రం తాను నమ్మనని తెలిపారు. పట్టిసీమ చాలా ఉపయోగకరమని... ఈ ప్రాజెక్టు వల్ల ఇవాళ కృష్ణా డెల్టా బతికిందని అన్నారు. 

Jagan
modi
Chandrababu
daggubati venkateswara rao
pattiseema
polavaram
  • Loading...

More Telugu News