vighnesh shivan: దర్శకుడిగా విఘ్నేశ్ శివన్ .. నిర్మాతగా నయనతార

  • మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నయనతార 
  • దర్శకుడిగా విఘ్నేశ్ శివన్ 
  • త్వరలో సెట్స్ పైకి  

దర్శకుడు విఘ్నేశ్ శివన్ .. హీరోయిన్ నయనతార మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే టాక్ కోలీవుడ్లో చాలాకాలంగా షికారు చేస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఈ విషయాన్ని ఖండించకపోగా, తాము విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విఘ్నేశ్ శివన్ పట్ల ప్రేమతోనే నయనతార నిర్మాతగా మారిందనేది తాజా సమాచారం.

తమిళంలో లేడీ ఓరియెంటెడ్ కథలు రెడీ చేసుకున్న దర్శకులకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు నయనతార. అందుకు కారణం ఇప్పటివరకూ ఆ తరహా సినిమాల్లో నటన పరంగా ఆమె సాధించిన మార్కులు .. అవి రాబట్టిన వసూళ్లు అనే చెప్పాలి. అలా విఘ్నేశ్ శివన్ కూడా లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసి నయనతారకి వినిపించాడట. ఈ సినిమాలో కథానాయికగా నటించడానికి .. తానే నిర్మించడానికి నయనతార అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.   

vighnesh shivan
nayanatara
  • Loading...

More Telugu News