dhoni: ప్రాణహాని భయాలతో.. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ధోనీ భార్య

  • ఇంటివద్ద ఒంటరిగా ఉంటానన్న సాక్షి
  • తరచుగా ప్రయాణాలు చేస్తుంటా
  • ఎవరికైనా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంది. తనకు ప్రాణహాని భయం ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. పిస్టల్ లేదా .32 రివాల్వర్ ను తీసుకోవాలని భావిస్తోంది. ఇంటివద్ద తాను తరచుగా ఒంటరిగా ఉంటానని, వ్యక్తిగత పనుల మీద అప్పుడప్పుడు ప్రయాణిస్తూ ఉంటానని ఆమె తెలిపింది.

ఈ నేపథ్యంలో, తాను ఎవరికైనా టార్గెట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయుధం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. రాంఛీ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆమె లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా... ప్రస్తుతం పోలీస్ వెరిఫికేషన్ జరుగుతోంది. గతంలో ధోనీ కూడా ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తొలుత అతని దరఖాస్తును తిరస్కరించారు. ఆ తర్వాత 9ఎంఎం పిస్టల్ కు లైసెన్స్ ఇచ్చారు.

dhoni
wife
sakshi
gun
licence
  • Loading...

More Telugu News