BJP: బీజేపీ-పీడీపీ విడిపోవడంపై రాహుల్‌ స్పందన

  • బీజేపీ-పీడీపీలది అవకాశవాద కూటమి
  • జమ్ము, కశ్మీర్‌ని నాశనం చేసింది
  • ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు 
  • రాష్ట్రపతి పాలనలోనూ విధ్వంసం కొనసాగే అవకాశం

జమ్ము, కశ్మీర్‌లో పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని బీజేపీ స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రపతి పాలన ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా బీజేపీ తీరుపై మండిపడ్డారు.

బీజేపీ-పీడీపీల అవకాశవాద కూటమి జమ్ముకశ్మీర్‌ని నాశనం చేసిందని, మన సైనికులతో పాటు ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జమ్ము, కశ్మీర్‌లో శాంతి కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లిన యూపీఏ ప్రయత్నాలన్నీ వీరి పాలనలో కాలి బూడిదైపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలనలో కూడా అక్కడ విధ్వంసం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అసమర్థత, అహంకార, ద్వేషపూరిత చర్యలు ఎప్పటికీ విఫలమవుతూనే ఉంటాయని విమర్శించారు.   

  • Loading...

More Telugu News