Pawan Kalyan: కేంద్రం నుంచి టీడీపీ బయటకొస్తే పవన్ కల్యాణ్ కు కోపమొచ్చింది: దేవినేని ఉమ సెటైర్లు

  • ఏపీకి మోసం చేసిందనే కేంద్రం నుంచి బయటకొచ్చాం
  • పవన్ కు కోపమొచ్చి రోడ్డెక్కాడు
  • రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేకపోతున్నారు

పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద పోలవరం కుడికాల్వకు దేవినేని ఉమ ఈ రోజు జలహారతి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదని, ప్యాకేజ్ ఇస్తామని చెప్పి పనులు చేయలేదని కేంద్రంపై విమర్శలు చేశారు. అందుకనే, మంత్రి పదవులు రెండూ వదిలేసి కేంద్రం నుంచి బయటకొచ్చేశామని అన్నారు.

ఈ విధంగా తాము చేస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కోపమొచ్చిందని, ఆయన ఓ పక్క రోడ్డెక్కాడని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ తన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబునాయుడిని తిడుతున్నారని మండిపడ్డారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో చంద్రబాబు కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతుంటే వీళ్లందరూ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడుతుంటే ఆయన్ని ప్రతిపక్షాలు ఎన్నో తిట్లు తిడుతున్నాయని మండిపడ్డారు. ఎంత దుర్మార్గమంటే.. పని చేసే కలెక్టర్ పై కూడా విమర్శలు చేస్తున్నారని.. ఇంత కన్నా నీచమేమైనా ఉందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan
devi neni
  • Loading...

More Telugu News