Rahul Gandhi: పీసీసీ అధ్యక్ష పదవిని సంపత్ కోరడంలో తప్పులేదు: మల్లు రవి

  • ఎవరికైనా పీసీసీ అధ్యక్షుడు కావాలనే కోరిక ఉంటుంది
  • రాహుల్ ను పీఎంగా చూడాలనేది యువత భావన
  • రాహుల్ పుట్టిన రోజు వేడుకల్లో రవి స్పందన

పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టాలనే కోరిక ఎవరికైనా ఉంటుందని, ఎమ్మెల్యే సంపత్ కూడా అధ్యక్ష పదవిని కోరడంలో తప్పు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. 2019 తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాల్సిందిగా సంపత్ కోరిన సంగతి తెలిసిందే.  

ఈ నేపథ్యంలో మల్లు రవి మాట్లాడుతూ, సంపత్ వ్యాఖ్యలను బట్టి 2019 వరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని యువత రాహుల్ ను ప్రధానమంత్రిగా చూడాలని భావిస్తోందని చెప్పారు.

Rahul Gandhi
mallu ravi
Uttam Kumar Reddy
tpcc
  • Loading...

More Telugu News