parakala: పరకాల ప్రభాకర్ రాజీనామాపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
- రాజీనామాను ఆమోదించే ప్రసక్తేలేదు
- ఎవరో ఆరోపణలు చేశారని రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
- పరకాల ప్రభాకర్‌పై వస్తోన్న విమర్శలపై టీడీపీ వర్గాల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన రాజీనామా లేఖను పంపగా, దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆయన రాజీనామాను ఆమోదించే ప్రసక్తేలేదని చెబుతూ.. ఎవరో ఆరోపణలు చేశారని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
కాగా, ఈ విషయంపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ... గతంలో తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ప్రభాకర్ భార్య, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారని, మరోవైపు పరకాల ప్రభాకర్ విశాలాంధ్ర మహాసభ పేరిట సమైక్య ఉద్యమాన్ని నడిపారని పేర్కొన్నాయి. ఆ విషయాలు విపక్ష నేతలకు తెలియవా? అని ప్రశ్నించాయి.