sensex: ఏ దశలోనూ కోలుకోని మార్కెట్లు.. భారీగా పతనమైన సెన్సెక్స్

  • మార్కెట్లపై వాణిజ్య యుద్ధ భయాలు
  • 262 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10,710 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, దేశీయ మార్కెట్లు కూడా భారీగా ప్రభావితమయ్యాయి. ఈ ఉదయం 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 262 పాయింట్ల నష్టంతో 35,287కు పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 10,710 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ (12.35%), జైప్రకాశ్ అసోసియేట్స్ (9.09%), యూకో బ్యాంక్ (7.61%), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (5.61%), వక్రాంగీ లిమిటెడ్ (4.97%).  

టాప్ లూజర్స్:
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (-6.56%), అవంతి ఫీడ్స్ (-6.21%), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (-5.93%), మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (-5.33%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (-5.06%).   

  • Loading...

More Telugu News