nithin: 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు సెంటిమెంట్

- నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం'
- ముగింపు దశలో చిత్రీకరణ
- కథానాయికలుగా రాశిఖన్నా .. నందిత శ్వేత
దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నితిన్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేత నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్టుగా సమాచారం.
