Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించండి.. కానీ ఎక్కువ కాలం కొనసాగించకూడదు: ఒమర్‌ అబ్దుల్లా

  • ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకీ మెజార్టీ లేదన్న ఒమర్‌
  • గవర్నర్‌ను కలిసి వినతి
  • గవర్నర్ పాలన దిశగా వ్యవహారాలు
  • కాసేపట్లో మెహబూబా ముఫ్తీ మీడియా సమావేశం

జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ బంధం తెగిపోయిందన్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించిన అనంతరం మెహబూబా ముఫ్తీ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తమ రాష్ట్ర గవర్నర్ ను కలిశారు.

అనంతరం ఒమర్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తమ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ మెజార్టీ లేదని అన్నారు. జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన విధించాలని తాము కోరామని, అలాగే ఎక్కువ కాలం పాటు ఆ పాలన కొనసాగించరాదని చెప్పామని తెలిపారు. కాగా, ఆ రాష్ట్రంలో పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్ కి 15, కాంగ్రెస్ కి 12, ఇతరులకు 7 సీట్లు ఉన్నాయి. తన రాజీనామాపై మెహబూబా ముఫ్తీ కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు.  

  • Loading...

More Telugu News