kamal: ముందుగా 'శభాష్ నాయుడు' .. ఆ తరువాతనే 'భారతీయుడు 2'

  • కమల్ హీరోగా 'శభాష్ నాయుడు'
  • దర్శక నిర్మాత కూడా ఆయనే
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ

ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నారు. ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ ఆయన ప్రకటించారు. ఈ సినిమా తరువాత ఆయన 'భారతీయుడు' సీక్వెల్ షూటింగులో పాల్గొననున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అంతకు ముందే తాను 'శభాష్ నాయుడు' సినిమాను పూర్తి చేయనున్నట్టు తాజా ఇంటర్వ్యూలో కమల్ చెప్పుకొచ్చారు.

కమల్ కథానాయకుడిగా .. ఆయనే దర్శక నిర్మాతగా 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ చాలాకాలం క్రితం మొదలైంది. రమ్యకృష్ణ ..శ్రుతిహాసన్ .. బ్రహ్మానందం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న తరువాత కమల్ ప్రమాదానికి గురై కొన్నాళ్ల పాటు హాస్పిటల్లోనే వున్నారు. అలా అప్పుడు ఆగిపోయిన ఈ సినిమా షూటింగును తిరిగి మొదలుపెడతానని ఆయన అన్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

kamal
ramyakrishna
sruthi
  • Loading...

More Telugu News