gulam nabi azad: జరిగిందంతా మంచికే.. కశ్మీర్ ప్రజలు ఉపశమనం పొందుతారు!: గులాం నబీ అజాద్

  • పీడీపీతో బీజేపీ విడిపోవడం మంచిదే
  • కశ్మీర్ ను బీజేపీ నాశనం చేసింది
  • ఎంతో మంది ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయారు

జమ్ముకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి విచ్ఛిన్నమైన సంగతి తెలిసిందే. కూటమి నుంచి బీజేపీ బయటకు రావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ స్పందించారు. జరిగిందంతా మంచికే అనుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు కొంచెం ఉపశమనం పొందుతారని అన్నారు. కశ్మీర్ ను బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. గత మూడేళ్ల కాలంలో ఎంతో మంది కశ్మీరీలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రశ్నే తలెత్తదని బదులిచ్చారు. 

gulam nabi azad
Jammu And Kashmir
pdp
bjp
  • Loading...

More Telugu News