uber atxi: ఊబర్ క్యాబ్స్ యూజర్లకు శుభవార్త... త్వరలోనే తక్కువ రేట్లకే రైడింగ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-68f85c4e27ec8aa3907ad0992cb5dccd2d370ea0.jpg)
- రైడ్ ఆలస్యమైనా ఫర్వాలేదంటే తక్కువ చార్జీ
- ఉద్యోగులపై పరీక్షిస్తున్న ఊబర్
- త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఊబర్ క్యాబ్ కు బుకింగ్ సమయంలో డిమాండ్ ను బట్టి చార్జీలు ఉంటాయని తెలిసిందే. అయితే, ఒకవేళ చార్జీ ఎక్కువ అనుకుంటే కాస్తంత ఓపిక పడితే తక్కువ చార్జీకే రైడ్ కు వెళ్లే అవకాశం రానుంది. ఈ ఫీచర్ ను తన ఉద్యోగులపై ఊబర్ పరీక్షిస్తోంది.
ఆలస్యమైనా ఫర్వాలేదని చెప్పే కస్టమర్లకు తక్కువ రేట్లకే రైడ్ ఆఫర్ కల్పించాలన్నది ఊబర్ ఉద్దేశ్యం. అయితే, ఎప్పటి నుంచి ఈ ఫీచర్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేదీ కంపెనీ నుంచి సమాచారం లేదు. అలాగే, సాధారణ రైడ్ కు, కొంత ఆలస్యమైనా వేచి ఉండే వారికి మధ్య రేట్ల పరంగా ఎంత తేడా అన్నది ఈ సేవలు ఆరంభమైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.