Vijayawada: యాంకర్ తేజస్విని భర్త పవన్ కుమార్ కోసం ముమ్మర గాలింపు!

  • పవన్ కుమార్ ప్రమేయం ఉంది
  • వేధించినట్టు ఆధారాలుు లభించాయి
  • ఆయన సెల్ ఫోన్ ను సీజ్ చేశామన్న పోలీసులు

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య వెనుక ఆమె భర్త పవన్ కుమార్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉండగా, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. పవన్ ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు.

కంకిపాడు పీఎస్ లో తేజస్విని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సూసైడ్ నోట్ లో తేజస్విని రాసిన వివరాలు, ఆమె తల్లిదండ్రులను విచారించిన తరువాత తమకు లభించిన వివరాలకు పొంతన లేదని, ఆ కారణంతోనే కేసు విచారణ జటిలమైందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కుమార్ ఫోన్ ను సీజ్ చేశామని, దానిలోని సమాచారాన్ని విశ్లేషించగా, తేజస్వినికి వేధింపులు నిజమేనని తేలిందని, సాధ్యమైనంత త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని తెలిపారు.

Vijayawada
anchor
Tejaswini
Sucide
Pawan Kumar
  • Loading...

More Telugu News