srinivas reddy: నేను బైక్ నడుపుతుండగా యాక్సిడెంట్ జరిగింది .. అతను నటనకు దూరమయ్యాడు: కమెడియన్ శ్రీనివాస రెడ్డి

  • ఆయన నాకు మంచి ఫ్రెండ్ 
  • ఇద్దరం కలిసే తిరిగేవాళ్లం 
  • అలా బైక్ పై ఖమ్మం వెళ్లాము     

తెరపై నవ్వుతూ .. నవ్విస్తూ వుండే శ్రీనివాసరెడ్డి, తన జీవితంలో జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు. "శివారెడ్డి (మిమిక్రీ శివారెడ్డి కాదు) నాకు మంచి ఫ్రెండ్ .. సీరియల్స్ లో నటిస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళుతుండేవాళ్లం. ఒకసారి నేను బైక్ పై ఖమ్మం వెళుతూ వుంటే .. తను కూడా వస్తానన్నాడు.

'పాలేరు' దాటిన తరువాత ఆగివున్న బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించగా, అటు నుంచి వస్తోన్న లారీ కొట్టేసింది. దాంతో రోడ్డుకి దూరంగా చెరో వైపున పడిపోయాము. నా తొడ ఎముక విరిగిపోయి బయటికి వచ్చేసింది. శివారెడ్డి కాళ్లకు .. తలకు దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల వున్నవాళ్లు .. దగ్గరలో వున్న హాస్పిటల్లో చేర్పించారు. శివారెడ్డినే హైదరాబాద్ తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పడంతో, అంబులెన్స్ లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ప్రమాదం వలన ఆయనకున్న స్కిన్ ప్రోబ్లం ఒక్కసారిగా ఎక్కువైపోయింది. అందువలన ఆయన నటనకి దూరమయ్యాడు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.    

srinivas reddy
ali
  • Loading...

More Telugu News