rana: రక్తపోటు తగ్గగానే ఆపరేషన్ చేయించుకుంటా: రానా

  • నేను కిడ్నీ సమస్యతో బాధపడటం లేదు
  • కంటి సమస్యతో బాధపడుతున్నా
  • ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా

టాలీవుడ్ విలక్షణ నటుడు రానా కంటికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి రానా సిద్ధమయ్యాడు. టైమ్ కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తండ్రి సురేష్ బాబు కూడా ఓ సందర్భంలో చెప్పారు.

తాజాగా ఈ అంశంపై రానా స్పందిస్తూ, తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానంటూ వార్తలు వస్తున్నాయని... ఆ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. కంటికి సంబంధించిన సమస్యతో మాత్రమే తాను బాధ పడుతున్నానని... త్వరలోనే ఆపరేషన్ జరుగుతుందని తెలిపాడు. బీపీ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ చేయించుకోవడం కుదరలేదని... రక్తపోటు తగ్గగానే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. 

rana
tollywood
health problem
operation
  • Loading...

More Telugu News