chiranjeevi: అందుకే చిరంజీవి మరింత బరువు పెరిగారట!

- 'సైరా' షూటింగులో చిరంజీవి
- కోకాపేట్ లో ప్రత్యేకమైన సెట్
- నెల రోజుల పాటు జరగనున్న షూటింగ్
ఈ మధ్య కాలంలో చిరంజీవిని చూసినవారు .. ఆయన మరింత బరువు పెరగడం గమనించారు. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా కనిపించే చిరంజీవి ఇలా ఎందుకు లావయ్యారనే విషయాన్ని గురించే మాట్లాడుకున్నారు. అయితే ఆయనలా బరువు పెరిగింది 'సైరా' సినిమా కోసమేనట. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన మరింత వయసు మళ్లినవాడిగా కనిపించే సన్నివేశాలు వున్నాయట. అందుకోసమే ఆయన అలా కనిపిస్తున్నారని తెలుస్తోంది.
