Congress: గాయకుడిపై నోట్ల వర్షం కురిపించిన గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

  • డబ్బులు విసిరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్
  • ఆ డబ్బులను బాలికా విద్య కోసం ఉపయోగిస్తారని వ్యాఖ్య
  • తనకు ఆర్‌బీఐ నిబంధనల గురించి తెలుసని వివరణ

గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్.. పఠాన్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఓ గాయకుడిపై డబ్బుల వర్షం కురిపించారు. ఈ విషయం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ... గాల్లోకి ఎగరేసిన డబ్బులను బాలికా విద్య కోసం ఉపయోగిస్తారని, తనకు భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల గురించి ఎంతో కొంత తెలుసని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఎమ్మెల్యే రూ.10 నోట్ల కట్టలను తెచ్చుకుని ఇలా విసిరినట్లు సమాచారం.         

Congress
mla
Gujarath
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News