bjp: ఏపీలో ఎవరికైనా బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలుసా?: ఏపీ మంత్రి ఆనంద్ బాబు సెటైర్లు

  • అవాకులు చవాకులు పేలడం జీవీఎల్ కు తగదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని చంద్రబాబు గౌరవించారు
  • కేసుల మాఫీకి బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యాడు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని చంద్రబాబు గౌరవించారు తప్ప, భయపడి కాదని అన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారని, కేసుల మాఫీకి బీజేపీతో జగన్ కుమ్మక్కై దొంగ నాటకాలాడుతున్నారని, విభజన హామీలపై మోదీని ఏనాడైనా జగన్ ప్రశ్నించారా? అని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, తమ పార్టీ నేతలపై అవాకులు చవాకులు పేలుతున్న జీవీఎల్ అసలు రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు ఉన్నారు.

bjp
gvl
nakka anand babu
  • Loading...

More Telugu News