Chandrababu: ఏపీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

  • ఒక్కో కేశఖండన టిక్కెట్‌పై రూ.25 చొప్పున ఇస్తామన్న సీఎం
  • రూ.12 నుంచి 25 వరకు చేయడం చాలా ఎక్కువన్న చంద్రబాబు
  • విధుల్లోకి చేరాలని వ్యాఖ్య

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు అమరావతిలోని ఏపీ సచివాలయంలో వారు ఆందోళన కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారులోంచి బయటకు వచ్చిన చంద్రబాబు వారితో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్య పరిష్కరించుకునే పద్ధతి ఇది కాదని చంద్రబాబు అన్నారు. ఒక్కో కేశఖండన టిక్కెట్‌పై నాయీ బ్రాహ్మణులకు రూ.25 చొప్పున ఇస్తామని అన్నారు. సమస్యను అర్థం చేసుకుని విధుల్లో చేరాలని అన్నారు. రూ.12 నుంచి 25 వరకు పెంచడం అంటే చాలా ఎక్కువని అన్నారు. అంతకు ముందు నాయీ బ్రాహ్మణులు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో చేసిన చర్చలు సఫలం కాలేదు. 

Chandrababu
Andhra Pradesh
Chief Minister
  • Loading...

More Telugu News