Kerala: హీరోయిన్‌ అమలాపాల్‌పై మరింత కఠినంగా ముందుకు వెళ్లనున్న కేరళ ప్రభుత్వం!

  • కారు పన్ను ఎగ్గొట్టాలని చూసిన అమలాపాల్‌
  • 20 లక్షల పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం
  • ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశం

సినీ నటి అమలాపాల్ గతంలో పుదుచ్చేరిలో ‘బెన్స్ ఎస్ క్లాస్’ అనే రూ.1.12 కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేసి, పన్ను ఎగ్గొట్టేందుకు పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంటోంది. ఆ కారునే ఆమె కేరళలో ఉపయోగించుకుంటోంది. ఇటీవలే ఆమె ఈ కేసులో న్యాయస్థానంలో లొంగిపోయింది. తాజాగా ఈ కేసులో త్వరగా ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని తమ పోలీసులను కేరళ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.  

కాగా, పుదుచ్చేరిలో కారు రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆమె కేరళ సర్కారుకి రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టింది. అమలాపాల్‌తో పాటు గతంలో ఇదే విధంగా పన్నులు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ గోపీ, మరో నటుడు ఫహద్‌ ఫజిల్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం ఇవ్వడంతో నటుడు ఫహద్‌ పన్ను చెల్లించాడు. అమలాపాల్‌, సురేష్‌ గోపీ మాత్రం అందుకు నిరాకరించడంతో వారిపై కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.                 

  • Loading...

More Telugu News