varalakshmi: వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న వరలక్ష్మి

  • విజయ్ సరసన ఒక సినిమా 
  • విశాల్ మూవీలోను కీలకపాత్ర 
  • ధనుష్ 'మారి' సీక్వెల్ లో కలెక్టర్ గా

తమిళంలో బొద్దుగా వుండే కథానాయికలకు క్రేజ్ ఎక్కువ. అందువలన అక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ కి అభిమానుల సంఖ్య ఎక్కువ. ఈ సుందరి తమిళ సినిమాలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. ఇంతవరకూ ఈమె తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు పెద్దగా చేసినట్టు కనిపించదు. కానీ ఇక వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆమె రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

తమిళంలో తాను చేసిన సినిమాలు తెలుగులోను విడుదలయ్యే విషయంలో శ్రద్ధ పెడుతోందట. ఈ కారణంగా తమిళంలో ఈ అమ్మడు చేస్తోన్న 'పందెం కోడి' సీక్వెల్ .. 'మారి' సీక్వెల్ ..  విజయ్ - మురుగదాస్ మూవీ తెలుగులోను రిలీజ్ కానున్నాయి. 'పందెం కోడి' సీక్వెల్ లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలోను .. 'మారి' సీక్వెల్ లో కలెక్టర్ గాను .. విజయ్ మూవీలో రాజకీయ నాయకురాలిగాను ఆమె కనిపించనుంది. ఈ సినిమాల తరువాత ఇక్కడి అవకాశాలను కూడా కొట్టేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

varalakshmi
vijay
vishal
dhanush
  • Loading...

More Telugu News