mars: భూమికి సమీపంలోకి అంగారకుడు... వచ్చే నెల 27న అరుదైన దృశ్యం
- సూర్యునికి ఎదురు పడనున్న అంగారకుడు
- ఇలా 15-17 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది
- ఆ సమయంలో అంగారకుడు భూమికి దగ్గరవుతాడు
- నాసా ప్రకటన
మార్స్ (అంగారక గ్రహం) ను వచ్చే నెల స్పష్టంగా వీక్షించే అవకాశం లభించనుంది. జూలై 27న మార్స్ సూర్యునికి ఎదురుగా రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సూర్యుని వెలుగుతో ఆ సమయంలో అంగారకుడు వెలిగిపోనున్నాడు. మార్స్, సూర్యుడు రెండూ ఎదురెదురుగా రావడమే ఆ రోజు ప్రత్యేకత. ఇలా ప్రతి 15 లేదా 17 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని నాసా తెలిపింది.
‘‘అంగారకుని కక్ష్యలో సూర్యునికి ఎదురు పడడం అన్నది ఎక్కడైనా జరగొచ్చు. అయితే, సూర్యుడికి బహు దగ్గరగా ఇలా వచ్చినప్పుడు మాత్రం, అంగారకుడు భూమికి కూడా బాగా దగ్గరగా వస్తాడు’’ అని నాసా పేర్కొంది.