Rahul Gandhi: రాహుల్ గాంధీతో కుమారస్వామి భేటీ.. స్వామి నిర్ణయానికి రాహుల్ ఓకే చెబుతారా?

  • మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలనుకుంటున్న కుమారస్వామి
  • అవసరం లేదంటున్న సిద్ధరామయ్య
  • ఆసక్తికరంగా మారిన రాహుల్, కుమారస్వామిల భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని జేడీఎస్ పట్టుబడుతోంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీని కలిసి, చర్చిస్తానని కుమారస్వామి ఇటీవలే ప్రకటించారు.

మరోవైపు మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే తాను ముఖ్యమంత్రిగా ఉండగా... పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టామని, మరోసారి ఆ అవసరం లేదని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం నూతన ప్రాజెక్టులు, పథకాలను చేపట్టాలనుకుంటే వాటిని అనుబంధ బడ్జెట్ లో పొందుపరచవచ్చని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ తో కుమారస్వామి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ కు రాహుల్ ఒప్పుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. 

  • Loading...

More Telugu News