chaitu: చైతూ కోసం రంగంలోకి దిగుతోన్న తమన్నా!

- చందూ మొండేటి దర్శకత్వంలో
- 'సవ్యసాచి'రీమిక్స్ సాంగ్ షూటింగుకు సన్నాహాలు
- జూలై నెలాఖరులో సెట్స్ పైకి
ఒక వైపున కథానాయికగా చేస్తూనే .. మరో వైపున ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒక సినిమాకి ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుందో .. ఒక ఐటమ్ సాంగ్ కి కూడా దాదాపు అంతే తీసుకుంటుందనే టాక్ వుంది. ఐటమ్ సాంగ్స్ పరంగా కూడా తమన్నాకి మంచి క్రేజ్ ఉండటం వలన, ఆమెకి భారీ మొత్తం చెల్లించడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు.
