Tollywood: 'చికాగో లిస్టు'ను నేను బయట పెట్టలేదు: నటి శ్రీరెడ్డి

  • నా పేరిట తప్పుడు ఖాతా తెరిచారు
  • తెలుగులో రాస్తున్న రాతలు నావి కాదు
  • ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి, తన ట్విట్టర్ ఖాతాలో అమెరికాలోని చికాగోకు వెళ్లి వ్యభిచారం చేసిన హీరోయిన్ల పేర్లను వెల్లడించినట్టు వస్తున్న వార్తలపై స్పందించింది. తన పేరిట ఎవరో తప్పుడు ఖాతాను నిర్వహిస్తున్నారని, తానే పేర్లనూ బయట పెట్టలేదని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టింది.

"ట్విట్టర్ ఖాతాలో శ్రీరెడ్డి మల్లిడి పేరిట తెలుగులో రాస్తున్న రాతలు నావి కాదు. ఎవరో నా వైట్ కలర్ టాప్ పిక్చర్ వాడుతూ ట్విట్టర్ లో ఫేక్ ఎకౌంట్ తెరిచారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను ఏ చికాగో లిస్టునూ ఎవరికీ ఇవ్వలేదు. వారందరినీ నేను బాధితుల మాదిరిగానే చూస్తాను" అని వ్యాఖ్యానించింది.

Tollywood
Casting Couch
Sri Reddy
Twitter
Fake Account
Facebook
Chicago
Heroins
  • Error fetching data: Network response was not ok

More Telugu News