IMD: మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ కు వర్షాలు!: వాతావరణ శాఖ

  • మరో నాలుగు రోజులు వేచి చూడాలి
  • తెలంగాణపై రుతుపవనాల ప్రభావం తక్కువే
  • హైదరాబాద్ వాతావరణ శాఖ

హైదరాబాద్ వాసులు మరో నాలుగు రోజుల పాటు వర్షాల కోసం వేచి చూడాల్సిందేనని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ, నగర వ్యాప్తంగా వర్షం కురిసిన దాఖలాలు లేవు. ఈ నెల ప్రారంభంలో 2వ తేదీన భారీ వర్షం పడగా, అప్పటివరకూ గరిష్ఠ స్థాయుల్లో ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా ఎనిమిది డిగ్రీల వరకూ తగ్గి 31 డిగ్రీల స్థాయికి పడిపోయింది. ఆ తరువాత నైరుతి రుతుపవనాల విస్తరణ మందగించడంతో వర్షాలూ దూరమయ్యాయి. దీంతో ఉష్ణోగ్రతలు తిరిగి 37 డిగ్రీల స్థాయికి పెరిగాయి.

ఇక ఎండ వేడిమి మరో మూడు నాలుగు రోజుల పాటు ఉంటుందని, 22వ తేదీన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ అధికారి రాజారావు వెల్లడించారు. తెలంగాణపై రుతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మరిన్ని వర్షాలకు చాన్స్ ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News