Hyderabad: ఏడు ముఖాలు.. 14 చేతులు.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నమూనా సిద్ధం!

  • శ్రీ సప్తముఖ కాలసర్ప మహా గణపతిగా ఖైరతాబాద్ గణపతి 
  • 57 అడుగుల ఎత్తు  
  • నేడు నమూనా ఆవిష్కరణ

ఖైరతాబాద్‌లో ఈసారి నిలబెట్టబోయే మహాగణపతి విగ్రహ నమూనా సిద్ధమైంది. ఏడు ముఖాలు, 14 చేతులు, శిరస్సుపై ఏడు తలల సర్పం, ఏడు ఏనుగులతో శ్రీ సప్తముఖ కాలసర్ప మహా గణపతి విగ్రహం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్నట్టు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ తెలిపారు. విగ్రహ నమూనాను నేడు గణపతి ప్రాంగణంలో ఆవిష్కరించనున్నారు.

ఈసారి విగ్రహాన్ని 57 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నట్టు సుదర్శన్ తెలిపారు. విగ్రహ తయారీ కోసం షెడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్టు చెప్పారు. గులాబీ పువ్వులో నిలబడే గణపతి పక్కన మహాలక్ష్మి, మహా సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తుతో కమలం పూలపై దర్శనమివ్వనున్నాయి. గణపతికి కుడివైపున శ్రీనివాస కల్యాణం ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో లక్ష్మీదేవి-శ్రీనివాసుడితోపాటు బ్రహ్మ, శివుడు, నారదుడు, కుబేరుడు, సరస్వతి, పార్వతి, గరుత్మంతుడు కనిపించనున్నట్టు విగ్రహ శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News