shilpa sherry: మరోసారి గర్భవతి అయిందన్న వార్తలపై శిల్పాషెట్టి స్పందన

  • ఆసుపత్రి నుంచి వస్తున్న శిల్పా ఫొటో వైరల్
  • తల్లి కాబోతోందంటూ వార్తలు
  • రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లానన్న శిల్ప

బాలీవుడ్ నటి శిల్పాషెట్టి ఓ క్లినిక్ నుంచి బయటకు వస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మరోసారి గర్భవతి అయిందని, త్వరలోనే మరో బిడ్డకు జన్మను ఇవ్వబోతోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై శిల్పాషెట్టి స్పందించింది. తాను గర్భవతిని కానని... కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లానని ఆమె తెలిపింది. ఆరోగ్యానికి తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పాకు వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో  #ShilpaKoKyaHua (శిల్పాకు ఏమైంది?) అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద చర్చే నడుస్తోంది. 

shilpa sherry
pregnant
Bollywood
  • Loading...

More Telugu News