anupama parameswaran: చిరంజీవి పక్కన అర నిమిషం కనపడ్డా.. జన్మ ధన్యమయినట్టే: అనుపమ పరమేశ్వరన్

  • చిరంజీవి నా అభిమాన నటుడు
  • ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నాను
  • ప్రతిభ ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి

యువ నటి అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళం, మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ సినీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన అభిమాన నటుడు చిరంజీవి అని తెలిపింది. ఆయనతో కలసి అర నిమిషం నటించినా తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పింది. తన అభిమాన నటి నిత్యామీనన్ అని తెలిపింది. సావిత్రి మహానటి అని కొనియాడింది. తొలుత తనకు తెలుగు మాట్లాడటం సరిగా వచ్చేది కాదని, తెలుగు అర్థంకాక చాలా ఇబ్బంది పడేదాన్నని... ఇప్పుడు తెలుగులో తాను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపింది. ప్రతిభ ఉన్న వారికి సినీ రంగంలో మంచి అవకాశాలే ఉన్నాయని చెప్పింది.

anupama parameswaran
Chiranjeevi
tollywood
  • Loading...

More Telugu News